సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కి కరోనా - vijayendra prasad tests positive for covid-19
close
Published : 07/04/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కి కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఎలాంటి సమస్య లేదని సమాచారం. కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి వచ్చాక స్వల్ప లక్షణాలు ఉండడంతో  కొవిడ్‌ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆయన రెండువారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. తనను ఎవరూ సంప్రదించవద్దని, ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించారట.  ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి కథ అందిస్తున్నారు. జయలలిత జీవితాధారంగా, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటిస్తున్న ‘తలైవి’ సినిమాకి కూడా ఆయనే కథ అందిస్తున్నారు. ఇటీవల దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోని పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి విదితమే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని