Prajwal Revanna: ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు

హసనకు చెందిన జేడీఎస్‌ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు.

Published : 04 May 2024 00:23 IST

బెంగళూరు: జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హసనకు చెందిన జేడీఎస్‌ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు.

‘తుపాకీతో బెదిరించి ప్రజ్వల్‌ నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని అతడి మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఎంపీ క్వార్టర్‌కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్నూ, నా భర్తను చంపేస్తానని బెదిరించాడు. తనకు సహకరించకపోతే.. ఆ ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏ దేశంలో ఉన్నా పట్టుకొస్తాం: సీఎం

లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ దుబాయ్‌ నుంచి జర్మనీ పారిపోయాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ప్రజ్వల్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. వారికి తెలియకుండా నిందితుడు దేశం నుంచి పారిపోలేదన్నారు. ఈ క్రమంలో అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని అన్నారు. అది రద్దయితే.. అతడు విదేశాల్లో ఉండటానికి వీలులేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని