close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిహారిక పెళ్లి కూతురాయనే..

కొణిదెల ఇంట పెళ్లి సందడి

హైదరాబాద్‌: మెగా వారసురాలు నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. శనివారం స్వగృహంలో ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్నారట.

గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను నిహారిక మనువాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి తంతు జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ శుభకార్యానికి వేదిక కాబోతోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఇవీ చదవండి..

నిహారిక పెళ్లి పత్రిక ఇదేనా..?ఫొటోలు వైరల్‌

స్టార్స్‌తో పెళ్లండీ.. ఫేమస్సైపోయారండీ





Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు