Naga Chaitanya: ‘థ్యాంక్‌ యూ’ పూర్తి చేసేందుకు! - Telugu news naga Chaitanya Starer Thank You Last Schedule Shoot will Starts From Monday
close
Updated : 25/10/2021 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naga Chaitanya: ‘థ్యాంక్‌ యూ’ పూర్తి చేసేందుకు!

‘లవ్‌స్టోరి’లో మధ్య తరగతి కుర్రాడిగా కనిపించి హృదయాల్ని దోచుకున్నాడు కథానాయకుడు నాగచైతన్య. ‘థ్యాంక్‌ యూ’లో ఆయన ఆ నేపథ్యానికి చెందిన కుర్రాడిగానే కనిపిస్తాడని సమాచారం. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పూర్తి చేసేందుకు మరోసారి రంగంలోకి దిగుతోంది చిత్రబృందం. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నాగచైతన్య, అవికాగోర్‌తోపాటు మరికొంతమంది చిత్రీకరణలో పాల్గొంటారు. నాగచైతన్యకి జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: బి.వి.ఎస్‌.రవి, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌, మాటలు: వెంకీ, మిథున్‌ చైతన్య.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని