Renu Desai: నెటిజన్లపై నటి ఆగ్రహం - renu desai fires on netizens
close
Updated : 18/05/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Renu Desai: నెటిజన్లపై నటి ఆగ్రహం

మీ వల్ల వేరే వాళ్ల ప్రాణాలు పోతున్నాయ్‌

హైదరాబాద్: నటి రేణూ దేశాయ్‌ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పెట్టే సరదా మెస్సేజ్‌లు కారణంగా సాయం అందక వేరొకరి ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రేణు గత కొన్నిరోజుల నుంచి ఇన్‌స్టా వేదికగా సాయం కోరిన కొవిడ్‌ బాధితులకు తన వంతు చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకపై తనకి హాయ్‌, హలో, లేదా ఏదైనా సరదా మెస్సేజ్‌లు పంపించవద్దని ఆమె ఇటీవల తెలియచేసిన విషయం విదితమే.

కాగా, తాజాగా ఆమె మరోసారి అదే విషయాన్ని నెటిజన్లకు తెలియజేశారు. ‘దయచేసి నాకు హాయ్‌, హలో అనే మెస్సేజ్‌లు పంపించకండి. మీరు పంపించే మెస్సేజ్‌లు కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక  కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు. కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’ అని ఆమె అన్నారు. అంతేకాకుండా తన పేరుతో ట్విటర్‌లో ఉన్న ఖాతాని ఎవరూ ఫాలో కావొద్దని.. అది తనది కాదని ఆమె స్పష్టతనిచ్చారు.

ఇప్పటివరకూ 600మంది సాయం చేశా!

‘‘ప్రస్తుతం సినిమాలు, షూటింగ్‌లు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాను. దీంతో కనీసం 10-15మంది సాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. అలా సాయం చేయమని కోరుతూ నన్ను సంప్రదించిన వారికి ఏదైనా చేయాలని అనుకున్నా. బాధితుల ప్రాంతంలో నాకు తెలిసిన వారి ద్వారా సాయం చేయడం మొదలు పెట్టా. ఇప్పటివరకూ 600మందికి నా వంతు సహకారం అందించా. రోజుకు 14 గంటలు ఫోన్‌ ద్వారా మాట్లాడటానికే సరిపోతోంది. అఖీరా, ఆద్యలు కూడా నేను చేసే పనికి మద్దతు తెలుపుతున్నారు’’

‘‘ఇప్పటివరకూ రైతులకు ఏదైనా సాయం చేయాలని ఉండేది. వారి కోసమే ఏదైనా ఎన్జీవో ఏర్పాటు చేయాలనుకున్నా. వారి జీవన పరిస్థితులపై సినిమా కూడా తీస్తున్నా. కానీ, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సాధ్యపడటం లేదు. ఇప్పుడంతా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకే సాయం చేయాలని అనుకుంటున్నా. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ధన్యవాదాలు’’

‘‘ఇక సినీ నటుడు సోనూసూద్‌ జాతీయ స్థాయిలో చేస్తున్న సాయానికి ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా. అలాంటివారే ప్రస్తుతం దేశానికి కావాలి. పథకాలతో పని జరగదు. ఒక వ్యక్తికి నిజమైన అవసరం ఏంటో తెలుసుకుని దాన్ని అందించాలి. ప్రస్తుతం నాకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని వారికి కూడా నా వంతు సాయం చేస్తున్నా. దయచేసి ఎవరూ కరోనా మరణ వార్తలు, ఆందోళన కలిగించే వార్తలు చదవొద్దు’’ అని రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని