నిల్చున్న వారిని కాటేసిన మృత్యువు

తాజా వార్తలు

Published : 25/07/2020 00:20 IST

నిల్చున్న వారిని కాటేసిన మృత్యువు

మునగాల: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువద్ద రహదారి పక్కన నిల్చున్న వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. మృతులను కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంటేరు వాసులుగా గుర్తించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కారు దిగిన సమయంలో మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని