Crime News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తాజా వార్తలు

Updated : 21/08/2021 10:22 IST

Crime News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు.
మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను మంత్రి ఆళ్ల నాని బంధువులుగా గుర్తించినట్లు సమాచారం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని