చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

చిత్ర వార్తలు

సిబ్బందితో ఇరుముడుల తొలగింపు

వానీల ఇరుముడుల బియ్యం మల్లికార్జున స్వామి ఆలయం కింద మెట్లమార్గం వద్ద ఓ మూలన పోసేస్తుండడం, అవి చెత్తాచెదారాలతో కలిసి, వర్షానికి నానిపోవడంతో భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ‘శ్రద్ధగా ధారణ.. ఇలాగా విరమణ’ శీర్షికతో ఈనాడులో వచ్చిన చిత్ర కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. మెట్ల కింద భవానీలు పోసిన బియ్యాన్ని, ఇరుముడులను బస్తాల్లోకి ఎత్తి శుభ్రం చేశారు.  

- ఈనాడు, అమరావతి


రద్దీ ప్రాంతం.. ఇలా దిగడం ప్రమాదకరం!

గుంటూరు జిన్నాటవర్‌ నుంచి పాతబస్టాండ్‌ సిగ్నల్స్‌ వరకు నిత్యం ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఈక్రమంలో ఆర్టీసీ బస్సుల్లో నుంచి ప్రమాదకరంగా ప్రయాణికులు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు వృద్ధులు, మహిళలు ఇలా దిగి గాయాలపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. అధికారులు స్పందించి ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- ఈనాడు, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని