పింఛ మట్టికట్ట ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

పింఛ మట్టికట్ట ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు

సుండుపల్లి, న్యూస్‌టుడే : సుండుపల్లి మండలంలోని వై.ఆదినారాయణరెడ్డి పింఛ జలాశయం మట్టికట్ట ఎత్తు పెంచేందుకు, కుడికాలువ తూము ఏర్పాటు, కాలువ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అనుమతి లభించిందని నీటి పారుదలశాఖ ఈఈ వెంకట్రామయ్య తెలిపారు. గతేడాది వరదల ఉద్ధృతికి జలాశయం మట్టికట్ట తెగిపోయింది. కుడికాలువ కొంతభాగం ఆనవాళ్లు లేకుండా దెబ్బతింది. అదే ఏడాది కట్ట తెగిన ప్రాంతంలో రింగ్‌బండ్‌ వేసి కొంత వరకు నీటిని నిల్వ చేసి ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందించారు. కుడికాలువ పునరుద్ధరణ, మట్టికట్ట ఎత్తును పూర్వస్థాయికి పెంచడం వంటి పనులకు రూ.5.90 కోట్లతో నాలుగు నెలల కిందట ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభించిందని, నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. త్వరలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పింఛను సందర్శించి టెండర్లు పిలుస్తారని చెప్పారు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని