నైతికతే రాజకీయాలకు ప్రాణం
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

నైతికతే రాజకీయాలకు ప్రాణం

ప్రసంగిస్తున్న డి.కె.శివకుమార్‌

హావేరి, న్యూస్‌టుడే : ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఓటర్లను ఆకర్షించేందుకు తన ప్రత్యేకతను చాటుకున్నారు. హావేరి జిల్లా హానగల్‌ నియోజకవర్గం పరిధిలోని హొంకణ గ్రామంలో గురువారం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అధికార భాజపా కులం ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా తమ పార్టీ నైతిక విలువలే ప్రధానంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించేదిలేదని స్పష్టం చేశారు. విమర్శలేమైనా ఉంటే విధానసభ వేదికగా చేస్తామే తప్ప ఎన్నికల ప్రచారంలో కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో నిధులను నీటిలా ప్రవహింపచేస్తానని తనపై కొందరు చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నిధుల్లేవని చెబుతూనే ఈనెలలోనే ప్రాథమిక పాఠశాలల్ని పునః ప్రారంభిస్తామని ప్రకటించిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిణామాల్ని చూస్తుంటే పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉండదేమోననే సందేహం వ్యక్తమవుతోందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని