close

సోమవారం, డిసెంబర్ 16, 2019

తాజా వార్తలు

అదుపుతప్పి ఆటో బోల్తా

ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

మానవపాడు, న్యూస్‌టుడే : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి గాయాలపాలైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్సై అయ్యన్న కథనం ప్రకారం..కర్నూలు పట్టణానికి చెందిన రఫిక్‌, షేక్‌ఉసేన్‌, రషీద్‌ అనే ముగ్గురు కర్నూలుకు చెందిన మహమ్మద్‌ ఆటోలో మంగళవారం ఉదయం పెబ్బేరుకు భవన నిర్మాణ పనుల కోసం వెళ్లారు. పనులు ముగించుకుని అదే ఆటోలో కర్నూలుకు వెళ్తున్నారు.ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోకి రాగానే ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చినశునకాన్ని తప్పించబోయిరాత్రి 9.30 గంటల సమయంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ మహమ్మద్‌కు తీవ్ర గాయాలు కాగా.. రషీద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మహమ్మద్‌ మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. మహమ్మద్‌ భార్య సయ్యద్‌ షాహనాజ్‌బేగం ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.