close

తాజా వార్తలు

ఏ కన్నతల్లి బిడ్డడో..!

● రోజుల శిశువు కుక్కలపాలు


మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎ.ఎస్‌.ఐ. శ్రీనివాసరావు 

రామ్‌నగర్‌(ఒంగోలు నేరవిభాగం), న్యూస్‌టుడే: బుధవారం సాయంత్రం.. సుమారు ఆరున్నర గంటల సమయం.. అప్పుడే చీకటి పడుతోంది. ఆ ప్రాంతంలో ఓ కుక్క ఏదో పీక్కుతింటోంది.. ఎర్రగా మాంసం ముద్దలా ఉందది.. ఏంటా అని స్థానికులు కాసింత పరిశీలనగా చూస్తే, అది మాంసం ముద్దకాదు.. ఒళ్లంతా నెత్తురోడుతున్న పసిగుడ్డు మృతుదేహం.. దానిని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు.

ఆవేదనకు గురయ్యారు.. ఒంగోలు రామ్‌నగర్‌ తొమ్మిదో లైనులోని ఓ ఖాళీ స్థలంలో కనిపించిందీ ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఏ కన్నతల్లి బిడ్డడో ఏమో.. రోజుల పసిగుడ్ఢు. సమీపంలోని ఏదైనా వైద్యశాలలో జన్మనిచ్ఛి.. ఇక్కడ కర్కశంగా వదిలేశారో..? బతికున్న పసిగుడ్డును వీధి కుక్కలు పీక్కుతున్నాయో? మృత శిశువును పూడ్చిపెట్టకుండా రోడ్డు వెంట పడేసి వెళ్లారో? ఎన్నో సందేహాలు.. కారణమేదైనా అక్కడి వారిని ఆ దృశ్యం కన్నీళ్లు పెట్టించింది. గుండెలను మెలిమెట్టింది. కుక్కలను అదిలించిన స్థానికులు తాలుకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎ.ఎస్‌.ఐ. శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌ శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.