close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా వైరస్‌కు ముందు, ఆ తర్వాత..

ఎలా మారిపోయాడో చూడండి..

కాలిఫోర్నియా: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ సమస్త మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని బారిన పడి ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా మరణించగా, 51 లక్షల మందికిపైగా బాధితులయ్యారు. ఈ నేపథ్యంలో మహమ్మారి ధాటికి అతిగా నష్టపోయింది అగ్రరాజ్యం అమెరికా. అయితే, అదే దేశంలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి కోలుకున్నాక ఎలా మారిపోయాడన్నదే ఆసక్తికరం. సామాజిక మాధ్యమాల్లో అతను పోస్టు చేసిన ఓ ఫొటో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అది చూశాక ‘కరోనా వైరస్‌ సోకక ముందు.. ఆ తర్వాత’ అని పేర్కొనవచ్చు. ఎందుకంటే వైరస్‌ బారిన పడిన అతను, కోలుకున్నాక తనను తానే నమ్మలేనంతగా మారిపోయాడు. 

కాలిఫోర్నియాకు చెందిన మైక్ షుల్ట్‌(43) మార్చిలో వైరస్‌ బారిన పడ్డాడు. మియామీ బీచ్‌లో ఓ వేడుకకు హాజరయ్యాక అతని ఆరోగ్యం క్షీణించింది. మార్చి 16న ఆస్పత్రిలో చేరగా తీవ్ర శ్వాసకోస సమస్యలతో సతమతమయ్యాడు. దాంతో నాలుగున్నర వారాలపాటు వెంటిలేటర్‌పైనే చికిత్సపొందాడు. ఆరు వారాల తర్వాత కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందిన సమయంలో 20 కేజీలకు పైగా తగ్గడం గమనార్హం. వైరస్‌ సోకక ముందు 86 కేజీలున్న అతను, కోలుకున్నాక 63 కేజీలకు బరువు తగ్గాడు. తనలో ఈ మార్పు చూసి షాకయ్యాడు. ఈ నేపథ్యంలో వైరస్‌కు గురవకుముందు తీసిన ఓ ఫొటోతో పాటు చికిత్స తర్వాత తీసిన మరో ఫొటోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీంతో కరోనా వైరస్‌ తనని ఎంతలా మార్చేసిందనే విషయాన్ని అందరికీ తెలియజేశాడు. 

‘కరోనా వైరస్‌ సోకితే ఎలా ఉంటుందో అందరికీ తెలియజేయాలనుకున్నా. ఎవరైనా ఈ మహమ్మారి బారిన పడొచ్చు. దానికి చిన్నా, పెద్దా అనే తేడా ఏమీ ఉండదు. ఇతర అనారోగ్య సమస్యలున్నా వైరస్‌ దాడి చేస్తుంది. ఈ వైరస్‌ బారిన పడ్డాక అది నా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గించింది. నాకు న్యూమోనియా సోకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. మార్చి 16న ఆస్పత్రిలో చేరగా, నాలుగు వారాల తర్వాత స్వయంగా ఊపిరితీసుకున్నా. కోలుకున్నాక నా శరీరాన్ని చూసి నమ్మలేకపోయా, నాలో ఈ మార్పు చూసి చాలా బాధపడ్డా. మళ్లీ నా శరీర ధారుడ్యాన్ని సాధిస్తా’ అని మైక్‌ తన అనుభవాన్ని వెల్లడించాడు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.