close

తాజా వార్తలు

Published : 29/08/2020 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్పీ బాలు ఆరోగ్యంపై చరణ్‌ తాజా ప్రకటన

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ  గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. తన తండ్రి కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటితో పోలిస్తే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కొత్త సమాచారం ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో ఎస్పీ బాలు కరోనా బారిన పడటంతో ఆయన్ను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన