లాక్‌డౌన్‌తో మనస్తాపం..యువతి బలవన్మరణం 
close

తాజా వార్తలు

Published : 14/05/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌తో మనస్తాపం..యువతి బలవన్మరణం 

రాయదుర్గం(హైదరాబాద్‌): మణికొండ ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ భవనం 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన ఈరవల్లిక(20) ఫిబ్రవరి 29 నుంచి ఎల్‌హెచ్‌-3 బ్లాక్‌లోని ఫ్లాట్‌లో పనికి కుదిరింది. వారం క్రితం ఆమె అక్క ఓ పాపకు జన్మనిచ్చింది. ఈరవల్లిక తన తల్లికి ఫోన్‌ చేసి పాపను చూడటానికి వస్తానని చెప్పింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చేందుకు కుదరదని అక్కడే ఉండాలని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని