అప్పుడే మళ్లీ మనకు సాధారణ జీవితం: గేట్స్‌

తాజా వార్తలు

Published : 13/10/2020 20:44 IST

అప్పుడే మళ్లీ మనకు సాధారణ జీవితం: గేట్స్‌

కాలిఫోర్నియా: రెండోతరం కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరవాతే జనజీవితం సాధారణ స్థితికి వస్తుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మొదటి తరం వ్యాక్సిన్లతో సాధారణ జీవితం తిరిగి రాదు. వాటి కంటే అత్యంత ప్రభావంతమైన వాటివల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. రెండో తరం వ్యాక్సిన్లు అందరికి విస్తృతంగా అందుబాటులోకి రావాలి. అప్పుడు కొవిడ్-19 సృష్టించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని అంచనా వేశారు. 

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో బిల్‌గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రష్యా స్పుత్నిక్-వి పేరుతో ఆగస్టులో మొదటి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన సంగతి తెలిసిందే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వ్యాక్సిన్‌ 2020 చివరిలో లేక వచ్చే ఏడాది ప్రారంభంలో రిజిస్ట్రేషన్‌కు సిద్ధంగా ఉండొచ్చని  తెలిపింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో బిల్‌గేట్స్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ..మహమ్మారి సృష్టించిన వినాశనాన్ని అధిగమించడానికి ఒకటి లేక రెండు సంవత్సరాలు పట్టొచ్చన్నారు.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని