రెండోరోజు వందలోపు మరణాలు

తాజా వార్తలు

Updated : 03/03/2021 11:48 IST

రెండోరోజు వందలోపు మరణాలు

14,989 కొత్త కేసులు..98 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం 7,85,220 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..14,989 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది. కాగా, మరణాల సంఖ్య రెండో రోజు వందలోపే నమోదైంది. నిన్న 98 మంది మృత్యు ఒడికి చేరుకోగా..ఇప్పటివరకు 1,57,346 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు. 

ఇదిలా ఉండగా క్రియాశీల కేసుల్లో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 1,70,126 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.53 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 13,123 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీలు 1.08కోట్లకు పైబడగా..ఆ రేటు 97.06 శాతంగా ఉంది. 

మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. మార్చి ఒకటిన ఇది రెండో దశలోకి అడుగుపెట్టింది. నిన్న 7,68,730 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 1,56,20,749 మందికి టీకా అందించినట్లు తెలిపింది. 

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని