Vaccine: ఏ వయసు వారికి ఎన్ని వేశారంటే?
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: ఏ వయసు వారికి ఎన్ని వేశారంటే?

భారత్‌లో వ్యాక్సినేషన్‌ వివరాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు పేర్కొంది. 18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా దిల్లీలో 5.26లక్షల మందికి టీకాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇకపోతే, ఏపీలో 18 నుంచి 44 వారిలో 2624మందికి టీకాలు ఇవ్వగా.. తెలంగాణలో ఆ సంఖ్య 500గా ఉన్నట్టు తెలిపింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల వ్యవధిలో 11లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.04కోట్ల డోసుల టీకాను పంపిణీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని