శతాధిక స్ప్రింటర్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 01/08/2021 03:11 IST

శతాధిక స్ప్రింటర్‌ కన్నుమూత

చండీగఢ్‌: 93 ఏళ్ల వయసులో పరుగు మొదలెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచిన స్ప్రింటర్‌ మన్‌ కౌర్‌ కన్నుమూశారు. 105 ఏళ్ల ఆమె శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ‘‘అమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటివరకూ బాగానే ఉన్న ఆమెకు అనుకోకుండా ఏం జరిగిందో మాకు తెలియలేదు’’ అని ఆమె కొడుకు గుర్‌దేవ్‌ సింగ్‌ వెల్లడించాడు. గత కొన్ని నెలలుగా అనారోగ్యం బాధపడుతున్న ఆమెను మొహాలీలోని ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్పించారు. 1916, మార్చి 1న జన్మించిన మన్‌ కౌర్‌.. ‘చండీగఢ్‌ నుంచి అద్భుత అమ్మ (మిరాకిల్‌ మామ్‌ ఫ్రమ్‌ చండీగఢ్‌)’గా పేరు తెచ్చుకుంది. ఓ సారి పటియాలాలో పరుగు పందెంలో తన కొడుకు పోటీపడుతుంటే చూసిన ఆమె సరదా కోసమే 2007లో తొలిసారి చండీగఢ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొన్నారు. అప్పటి నుంచి పరుగు పైనే ధ్యాస పెట్టారు. 2017 ప్రపంచ మాస్టర్స్‌ క్రీడల్లో 100మీ. పరుగులో విజేతగా నిలిచిన ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన