సెల్‌ని దూరం పెడదామా!
close

తాజా వార్తలు

Published : 21/02/2019 00:31 IST

సెల్‌ని దూరం పెడదామా!

చిన్నా, పెద్దా వయసు తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ ఇప్పుడు టైం పాస్‌ సెల్‌ఫోన్లే. అయితే అవసరం మేరకు దీని వాడకం ఉంటే ఫరవాలేదు కానీ... అంతకు మించి అయితే అది వ్యసనంలా  మారిపోతుంది. దాన్నుంచి బయటపడాలంటే...!

* పిల్లలైనా, పెద్దలైనా పూర్తిగా సెల్‌ఫోన్‌కి దూరంగా ఉండండి... అంటే ఉండలేరు. అందుకే ప్రతి రోజు ఇంట్లో ఓ గంట టెక్నాలజీ ఫ్రీ సమయాన్ని పెట్టుకోండి. ఆ గంటలో స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా పెట్టేలా చూసుకోండి. క్రమంగా ఆ సమయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

* కాసేపు ఖాళీ దొరికితే చాలు ఫోన్‌ పట్టుకుని కూర్చుంటాం. ఈ ఖాళీ సమయమే లేకుంటే ఫోన్‌పైకి మన దృష్టి మరలదు. అందుకే ఏదయినా కొత్త కోర్సు, పెయింటింగ్‌, క్రాఫ్ట్స్‌, సంగీతం, నృత్యం.. ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడానికి కేటాయించండి.

* ఫోనుల్లో సామాజిక మాధ్యమాల యాప్‌లు వేసుకోవడం, ఎప్పుడూ లాగిన్‌ చేసి ఉంచడం వల్ల తెలియకుండానే అప్‌డేట్‌ల కోసం వేచి చేస్తుంటాం. వాటితోనే కాలం గడిపేస్తుంటాం కొన్నిసార్లు. అందుకే వీలైనంతవరకూ సోషల్‌మీడియా యాప్‌లను ఫోనుల్లో తగ్గించుకోవడం మంచిది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని