close

తాజా వార్తలు

పవన్‌ బర్త్‌డేకి వరుణ్‌ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: వెండితెర మీద అతడు కనిపిస్తే చాలు మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈలలు వేయాల్సిందే. అతని చూపులో పవరుంది. మాటలో పొగరుంది. టోటల్‌గా అతని ఇమేజ్‌కి ఓ లెక్కుంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. ఆ పేరులోనే వైబ్రేషన్‌ ఉంది. ఈ రోజు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 48వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ తను నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా పోస్టర్‌ను ట్విటర్‌ ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు. ‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏది ఏమైనా మీతోనే ఉంటాం’. అంటూ ట్విట్‌ చేశారు. 
హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరణ్‌తేజ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇదివరకూ ఈ జంట ‘ముకుందా’ సినిమాలో ఆడిపాడారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ పస్ల్‌ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబర్‌20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.