Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 107587
            [news_title_telugu_html] => 

పెద్దల సభకు భాజపా పెద్దలు?

[news_title_telugu] => పెద్దల సభకు భాజపా పెద్దలు? [news_title_english] => Decision soon on RS prospects of Sushma Swaraj LK Advani and Murli Manohar Joshi [news_short_description] => సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని భారతీయ జనతా పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. [news_tags_keywords] => Sushma Swaraj,LK Advani,Murli Manohar Joshi,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-04 10:40:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెద్దల సభకు భాజపా పెద్దలు? - Decision soon on RS prospects of Sushma Swaraj LK Advani and Murli Manohar Joshi - EENADU
close

తాజా వార్తలు

పెద్దల సభకు భాజపా పెద్దలు?

పరిశీలనలో సుష్మా, ఆడ్వాణీ, మురళీ మనోహార్‌ జోషీ పేర్లు!

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని భారతీయ జనతా పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల సమయంలో భాజపా.. ఆ పార్టీ పెద్దలను పట్టించుకోలేదని పడిన మచ్చను ఇప్పుడు తుడిచేసుకోవాలని భావిస్తోంది. ఎల్‌ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి సీనియర్లను మోదీ-షా ద్వయం పక్కన పెట్టిందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సమాధానంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా సీనియర్లకు ఆ పార్టీ మరింత గౌరవం ఇస్తుందనడానికి సూచకంగా వారికి రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. వీరిద్దరితో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా పెద్దల సభకు పంపే యోచనలో భాజపా ఉన్నట్లు పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ వారంలో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, సుష్మా ముగ్గురు పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో వయోపరిమితి విధించింది. ఆ పార్టీ నియమాల ప్రకారం 75ఏళ్లు మించిన వారికి లోక్‌ సభకు పోటీ చేసే అవకాశం ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో ఆడ్వాణీ, జోషీ ఇద్దరూ పోటీ చేయలేదు. అయితే సుష్మా స్వరాజ్‌ మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ గతేడాదే వెల్లడించారు. ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు. పోటీ చేయకపోయినప్పటికీ తాను పార్టీ వెంటే ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో సుష్మకు రాజ్యసభలో అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

భాజపా సీనియర్‌ నేత ఆడ్వాణీ పోటీ చేసే గాంధీ నగర్‌ స్థానాన్ని అమిత్‌ షాకు కేటాయించిన విషయం తెలిసిందే. వయోపరిమితి నిబంధన కారణంగా గాంధీ నగర్‌ను షాకు కట్టబెట్టారు. అక్కడ నుంచి పోటీ చేసిన షా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక మురళీ మనోహర్‌ జోషీ సైతం తన వారణాసి స్థానాన్ని 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం త్యాగం చేశారు. ఆ ఎన్నికల్లో జోషీ కాన్పూర్‌ నుంచి పోటీ చేసి 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో కాన్పుర్‌ నుంచి సత్యదేవ్‌ పచౌరీకి అవకాశం ఇచ్చారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.