T Congress: మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభం

తాజా వార్తలు

Updated : 24/08/2021 14:12 IST

T Congress: మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభం

మేడ్చల్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు చింతలపల్లికి చేరుకుని దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. శామీర్‌పేటలోని కట్ట మైసమ్మ ఆలయంలో రేవంత్‌ సహా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం అక్కడి నుంచి మూడుచింతలపల్లి దీక్షా శిబిరం వరకు కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా తరలి వచ్చారు. గ్రామంలోని దళిత బస్తీలో ఈరోజు రాత్రి రేవంత్‌ బస చేయనున్నారు. రేపు దళితవాడలోని కుటుంబాలతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వంపై చేపట్టిన దళితబంధుపైనా రేవంత్‌ అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. 

ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు నిర్వహించతలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలలో బహిరంగ సభలు నిర్వహించగా ఇది మొదటి దీక్షా కార్యక్రమం. మూడుచింతలపల్లి సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం కావడంతో పీసీసీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని తెలంగాణ సమాజానికి తెలియజేయడానికే ఇక్కడ రెండు రోజుల దీక్షకు నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని