AP News: సీఎం జగన్‌ను.. పట్టాభి అనకూడని మాట అన్నారు: సజ్జల

తాజా వార్తలు

Updated : 20/10/2021 16:52 IST

AP News: సీఎం జగన్‌ను.. పట్టాభి అనకూడని మాట అన్నారు: సజ్జల

తాడేపల్లి: తెదేపా నేతలు పరుష పదజాలం వాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కావాలనే మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి పరుష పదజాలం ఉపయోగించారు. ఉత్తర భారతదేశంలో అది ఓ బూతు మాట... అనకూడని మాట. దీని వెనుక కర్త కర్మ క్రియ చంద్రబాబే. గత 6 నెలలుగా నిస్పృహతో  తెదేపా నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక తెదేపా నేతలు ఇలా మాట్లాడుతున్నారు’’ అని సజ్జల ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని