ప్రచారం కోసం రేవంత్‌ ప్రేలాపనలు: ఎ.జీవన్‌రెడ్డి

ప్రధానాంశాలు

ప్రచారం కోసం రేవంత్‌ ప్రేలాపనలు: ఎ.జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడిగా సొంత పార్టీని బాగు చేసుకోవడం మాని రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల శాసన సభా కమిటీ (పీయూసీ) ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రచారం కోసం ఆయన చేసేవన్నీ ప్రేలాపనలేనన్నారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉన్నా అది సర్వనాశనమవుతుందన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌కు దిక్కులేక పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో మరింత రెచ్చిపోతున్నారు. కోకాపేటలో భూముల కొనుగోలుకు టెండర్లు వేసిన వాళ్లపై ఆర్టీఐ కింద వివరాలు తీసుకొని సీబీఐకి ఇవ్వడం బ్లాక్‌ మెయిల్‌కు పరాకాష్ఠ. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ పాదయాత్ర ఎందుకో తెలియట్లేదు. ఆయనకు సత్తా ఉంటే కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు తెచ్చి రైతుల ధాన్యం కొనుగోలు చేయించాలి’’ అని సవాలు చేశారు. 2023లో భాజపా కార్యాలయానికి, గాంధీభవన్‌కు తాళాలు వేసుకోవాల్సిందేనన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని