‘ఫావిపిరవిర్‌’ సురక్షితమే

ప్రధానాంశాలు

‘ఫావిపిరవిర్‌’ సురక్షితమే

ఈనాడు, హైదరాబాద్‌: ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేయడానికి వినియోగించే ‘ఫావిపిరవిర్‌’ ఔషధంపై పోస్ట్‌-మార్కెటింగ్‌ అధ్యయనాన్ని పూర్తి చేసినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ఈ పరిశీలనను గత ఏడాది జులై నుంచి చేపట్టారు. ఇప్పటికే తెలిసిన బలహీనత, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, డయేరియా, వాంతులు వంటి.. సాధారణ ‘సైడ్‌-ఎఫెక్ట్స్‌’ మినహా ఇతర పెద్ద ఇబ్బందులు ఏవీ లేనట్లు నిర్ధారణ అయింది. హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, నాసిక్‌, నాగ్‌పుర్‌, తిరువనంతపురం నగరాల్లో ఎంపిక చేసిన కొవిడ్‌-19 బాధితులపై ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కొవిడ్‌-19 బాధితులకు ‘ఫావిపిరవిర్‌’తో త్వరితంగా ఉపశమనం కలిగినట్లు తేలిందని గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ మాలిక్‌ స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని