నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లూ పూర్తి!

ప్రధానాంశాలు

నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లూ పూర్తి!

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు భారీ స్పందన
నేడు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం నవంబరు నెల కోటా టికెట్ల విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం నవంబరు, డిసెంబరు మాసాల టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో శుక్రవారం ఉదయం 9గంటలకు విడుదల చేసింది. రోజుకు 12వేల చొప్పున రెండు నెలలకు 7.08 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా మధ్యాహ్నం 1.30 కల్లా భక్తులు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా ఎస్‌ఈడీ టికెట్ల కోసం ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. తితిదే ఐటీ విభాగం, టీసీఎల్‌, జియో సంస్థ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో భక్తులు సులభంగా ఆన్‌లైన్‌లో టికెట్లను పొందారు. మొదటి గంటలోనే 4.20 లక్షల టికెట్లు భక్తులు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 1.30కు టికెట్లన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. టికెట్ల విక్రయం ద్వారా తితిదేకు దాదాపు రూ.21 కోట్ల ఆదాయం లభించింది. శనివారం ఉదయం 9గంటలకు నవంబరుకు సంబంధించిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని