యాపిల్ ఈవెంట్.. ఇవే ఇంపార్టెంట్‌..!
close

Updated : 28/02/2021 15:32 IST
యాపిల్ ఈవెంట్.. ఇవే ఇంపార్టెంట్‌..!

మార్చి నెలలో ఉండే అవకాశం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్చి నెల మీద ‘స్మార్ట్‌’ కన్ను పడినట్లుగా ఉంది. మిడ్‌ రేంజ్‌ నుంచి ప్రీమియం వరకు అన్ని రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు పలు సంస్థలు సిద్ధమైపోయాయి. అదే సమయంలో యాపిల్‌ సంస్థ అతిపెద్ద హార్డ్‌వేర్ స్ప్రింగ్ ఈవెంట్‌(2021)ను నిర్వహించబోతోంది. అయితే, ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించలేదు. ఆ కార్యక్రమంలో పలు ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా మార్చిలో కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకురావడం యాపిల్ సంప్రదాయం. మినీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో కొత్త ఐపాడ్‌ ప్రొను విడుదల చేయనుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఐమ్యాక్, మూడోతరం ఎయిర్‌ప్యాడ్స్‌, ఎయిర్‌ట్యాగ్స్, యాపిల్ టీవీ స్ట్రీమింగ్‌ బాక్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు నిపుణులు వెల్లడించారు. ఐఫోన్‌ SEకి సక్సెసర్‌గా మార్చిలో స్మార్ట్‌ఫోన్‌ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరివేటిని మార్కెట్లోకి తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.. అయితే, యాపిల్‌ తీసుకొచ్చే అవకాశాలు ఉన్న పలు ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం...

కొత్త ఐపాడ్‌ ప్రో... యాపిల్‌ టీవీ

టాబ్లెట్లకు పర్యాయపదంగా యాపిల్‌ ఐపాడ్‌ మారిందనే చెప్పొచ్చు. మరి అలాంటి యాపిల్ సంస్థ నుంచి కొత్తగా ఐపాడ్‌ వస్తోందంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. యాపిల్‌ ఐపాడ్‌ ట్యాబ్స్‌ ధర ఎక్కువైనా ఫీచర్లు అద్భుతంగా ఉంటాయన్నది ఇప్పటి వరకు యూజర్ల అభిప్రాయం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐపాడ్ ప్రో ట్యాబ్‌ పనితీరు బాగుండటంతో ఐపాడ్‌ ప్రో తర్వాతి వెర్షన్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అత్యాధునిక మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో కొత్త వెర్షన్‌ వచ్చే అవకాశం ఉంది. డిమ్మింగ్, కాంట్రాస్ట్‌, పిక్చర్‌ క్వాలిటీ మెరుగుపడనుంది. A14 ప్రాసెసర్‌తో కొత్త ఐపాడ్‌ ప్రొ ట్యాబ్‌ -5G సేవలను కూడా అందిపుచ్చుకునేలా రాబోతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎయిర్‌ ట్యాగ్స్‌, యాపిల్‌ టీవీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శామ్‌సంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ ట్యాగ్‌కు పోటీగా యాపిల్‌ ఎయిర్‌ట్యాగ్స్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 


అప్‌డేట్‌ అయిన ఐమ్యాక్‌.. మూడో తరం ఎయిర్‌పాడ్స్‌

యాపిల్‌ ఐమ్యాక్‌ టెక్నాలజీపరంగానే కాకుండా అత్యాధునికమైన డెస్క్‌టాప్‌. అయితే, ఐమ్యాక్‌ డిజైన్‌లో మార్పులు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం యూజర్ల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో మార్చిలో జరగబోయే యాపిల్ మెగా ఈవెంట్‌ -2021లో ఐమ్యాక్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ వచ్చే అవకాశం ఉంది. అతి పల్చటి బేజెల్స్‌తో 23 అంగుళాల స్క్రీన్‌సైజ్‌తో ఐమ్యాక్‌ రానుందని తెలుస్తోంది. అలానే యాపిల్‌ సిలికాన్‌ చిప్‌తో ఐమ్యాక్‌ మోడళ్లను విడుదల చేయాలని యాపిల్‌ సంస్థ భావిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అలానే మూడో తరం ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్‌ తీసుకురానుంది. ఇవి లుక్స్‌లో హై ఎండ్‌ ఎయిర్‌పాడ్స్‌ లానే ఉండనున్నట్లు సమాచారం. వీటి ఖరీదు దాదాపు రూ. 11వేలు ఉండొచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న