వీడియో ఊసులకు.. విలువైన చిట్కాలు
close

Updated : 24/02/2021 17:01 IST

వీడియో ఊసులకు.. విలువైన చిట్కాలు

ఎప్పుడైనా గూగుల్‌ అందించే ‘డ్యువో’ వీడియో కాలింగ్‌ యాప్‌ని ప్రయత్నించారా?హెచ్‌డీ క్వాలిటీతో కాల్స్‌ మాట్లాడొచ్చు. తక్కువ స్పీడ్‌ ఉన్న నెట్‌వర్క్‌తోనూ బ్రేక్స్‌ లేకుండా వీడియోలను ప్రదర్శిస్తుంది. ఇలా ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లను పలు రకాల ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ వెర్షన్లలతో పలకరిస్తున్న డ్యువో సర్వీసులోని కొన్ని చిట్కాలు..

ఫోన్‌ స్క్రీన్‌ని పంచుకోవడం..

వీడియో కాల్‌లో ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం మామూలే. కానీ.. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ ఫోన్‌లోని కంటెంట్‌ని వారికి చూపాలంటే? మీ ఫోన్‌ని వారికి షేర్‌ చేస్తారు. అంటే.. వీడియో కాల్‌లో మీ ‘ఫోన్‌ స్క్రీన్‌’ని వారితో పంచుకోవడం. దీంతో ఫోన్‌లో మీరు ఏం చూపినా వారికి కనిపిస్తుంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. స్క్రీన్‌ ఇతరులకు షేర్‌ చేసినప్పుడు కెమెరా ఆఫ్‌ అవుతుంది. ఇలా ఎప్పడైనా మీ స్క్రీన్‌ని ఇతరులతో పంచుకోవాల్సి వస్తే.. వీడియో కాల్‌ స్టార్ట్‌ చేశాక, స్క్రీన్‌కి కింది భాగంలో మూడు చుక్కల ఆప్షన్‌ని ట్యాప్‌ చేయాలి. వచ్చిన మెనూలో ‘స్క్రీన్‌షేర్‌’ కనిపిస్తుంది. తర్వాత ‘స్టార్ట్‌ నౌ’ని ఎంచుకుని స్క్రీన్‌ని షేర్‌ చేయొచ్చు.

డేటా ఆదా అవుతుంది

ఆఫీస్‌లో ఉన్నప్పుడు లేదా నగరాల్లో తిరుగుతున్నప్పుడు పెద్దగా డేటా సమస్యలు రాకపోవచ్చు. ఎప్పుడైనా పల్లెలు లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్తే కచ్చితంగా డేటా సమస్య వస్తుంది. అలాంటి సందర్భల్లో తక్కువ డేటాని వాడుకుని వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు డ్యువోలో డేటా సేవింగ్‌ మోడ్‌ని పెట్టుకోవచ్చు. దీంతో డీఫాల్ట్‌గా సాగే 720 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ వీడియో కాల్‌ క్వాలిటీని తగ్గించుకోవచ్చు. ఈ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసేందుకు డ్యువోని ఓపెన్‌ చేసి పై భాగంలో కుడివైపు కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూ నుంచి ‘కాల్‌ సెట్టింగ్స్‌’లోని ‘డేటా సేవింగ్‌ మోడ్‌’ని టర్న్‌ఆన్‌ చేయాలి.

డయలర్‌ యాప్‌తోనూ..

గూగుల్‌ డ్యువో నుంచి వాయిస్‌, వీడియో కాల్‌ చేయాలంటే.. పదే పదే యాప్‌ని ఓపెన్‌ చేయక్కర్లేదు. ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌గా నిత్యం వాడే డయలర్‌ యాప్‌ నుంచే చేయొచ్చు. కావాలంటే ఇప్పటికే డ్యువో యాప్‌ని వాడుతున్నవారు ఫోన్‌లోని డయలర్‌ యాప్‌ని ఓపెన్‌ చేశాక, ఏదైనా కాంటాక్ట్‌ని ఓపెన్‌ చేయండి. అక్కడ కనిపించే ఆప్షన్లలో డ్యువోని సెలెక్ట్‌ చేసుకుని వాయిస్‌, వీడియో కాల్స్‌ చేయొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న