AP EAPCET Results 2025: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి
గాంధీనగర్ (కాకినాడ): ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు (AP EAPCET 2025 Results) వచ్చేశాయ్. ఈ ఫలితాలను జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆదివారం సాయత్రం విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈఏపీసెట్ నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ప్రభుత్వం ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం.
ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్ & ఫార్మా) ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 3,62,448మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300మంది హాజరైనట్లు వెల్లడించారు. వీరిలో 2,57,509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన స్వల్ప వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు.ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
మే 19 నుంచి 20వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించగా.. 75,460మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,761మంది (89.80శాతం) అర్హత సాధించారు. అలాగే, మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో జరిగిన పరీక్షకు 2,64,840మంది విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 1,89,748మంది (71.65శాతం) అర్హత సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


