AP Lawcet 2025 Results: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్ చేయండి

Eenadu icon
By Features Desk Updated : 19 Jun 2025 16:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఏపీ లాసెట్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ లాసెట్‌ ఫలితాలు (AP Lawcet 2025 Results) విడుదలయ్యాయి. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయిలే సత్తా చాటారని ప్రశంసించారు. ఈ పరీక్షకు మొత్తంగా 27,253మంది దరఖాస్తు చేసుకోగా.. 20,826మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ లాసెట్‌ ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్‌ 5న ఏపీ లాసెట్‌-2025ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు రిజిస్ట్రేషన్ నంబర్‌, లాసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఏపీ లాసెట్‌ (మూడేళ్లు)లో టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

వేముల వెంకట శివసాయి భార్గవి (అనకాపల్లి), ముదునూరి రామ్‌తేజ్‌ వర్మ (సీతమ్మధార -విశాఖ), పల్నాటి సత్యాంజనదేవి (ఏలూరు), వి. రమేష్‌ (రాయచోటి-అన్నమయ్య), బొప్పన శరత్‌చంద్ర (అవనిగడ్డ-కృష్ణా), దాసరి మాధవరావు (సత్తెనపల్లి- పల్నాడు), డీవీ సూర్య సత్య మహేంద్ర (ఉండ్రాజవరం-తూ.గో), ఎం. మల్లికేశ్వరపు డి. సాయికృష్ణ (జి.కొండూరు- ఎన్టీఆర్‌), కిరణ్‌ కుమార్‌ సింగంశెట్టి (విజయనగరం), పాతూరు హరీష్‌ (రామవరప్పాడు- ఎన్టీఆర్‌)

లాసెట్‌ (ఐదేళ్లు)లో టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

పల్లపు గ్రీష్మ(అన్నమయ్య జిల్లా), సింగమల భావన (తిరుపతి), భత్తుల సూర్యతేజ (నరసారావుపేట-పల్నాడు), నక్కా ఉదయచంద్ర (చీపురుపల్లి -విజయనగరం), మరుపల్లి రమేష్‌ (పెందుర్తి-విశాఖ), వెంకటరమణ.యు (మదనపల్లి-అన్నమయ్య), లహరి ఎలుగూరి (కృష్ణలంక-విజయవాడ), సయ్యద్‌ అప్సానా జబాన్‌ (కల్లూరు -కర్నూలు), ఆళ్ల యశశ్వి (గుంటూరు), మహమ్మద్‌ ఇంతియాజ్‌ (భవానీపురం - విజయవాడ)

పీజీఎల్‌సెట్‌లో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన బైసని హరితశ్రీ తొలి ర్యాంకుతో మెరవగా.. యనమల లోకేశ్వరి (వైఎస్‌ఆర్‌ కడప-ఒంటిమిట్ట), కొర్సపాటి ప్రశాంత్‌ (ఒంగోలు), శ్రావ్య గొర్లి (విశాఖ-కంచరపాలెం), రమీజ్‌ రాజా షేక్‌ (విశాఖ), ఎం.విజయమణికంఠ (శ్రీకాకుళం), సీహెచ్‌. ద్యానేష్‌ నాయుడు (విజయనగరం), నిమ్మకూరి రామకృష్ణ (పొన్నూరు-గుంటూరు), శ్రీరాం బొడ్డు (హైదరాబాద్‌), ఆర్‌. దుర్గా ప్రవీణ్‌ (రాజమహేంద్రవరం)


Published : 19 Jun 2025 15:46 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని