APPSC: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 మెయిన్స్ ఫలితాలు విడుదల
ఏపీలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది.
అమరావతి: ఏపీలో ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(EO) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు ఈ పరీక్ష తుది కీని ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17న సీబీటీ విధానంలో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 26న ఉదయం 10గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏయే సర్టిఫికెట్లు తీసుకురావాలో ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఎవరైనా వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే మెరిట్ జాబితాలో తదుపరి అభ్యర్థికి అవకాశం కల్పించనున్నారు. ఫలితాలతో పాటు వెరిఫికేషన్‌కు ఏయే సర్టిఫికెట్లు తీసుకెళ్లాలో ఈ డాక్యుమెంట్‌లో తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్ కల్యాణ్
-
Indigo: విమానంలోనూ వృత్తి ధర్మం చాటారు.. చిన్నారి ప్రాణాలు కాపాడారు
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు