Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 400 మేనేజర్‌ పోస్టులు.. భారీ వేతనం

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 400 మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జులై 13 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 12 Jul 2023 18:01 IST

పుణె: బ్యాంకు ఉద్యోగాలకు(Bank jobs) సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(Bank of Maharashtra)లో 400 ఆఫీసర్‌ స్కేల్‌ 2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం (జులై 13) నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • ఆఫీసర్ స్కేల్-3: 100 పోస్టులు; 2. ఆఫీసర్ స్కేల్-2 పోస్టుల సంఖ్య 300
  • అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి
  • దరఖాస్తు తేదీ: జులై 13 నుంచి 25వరకు; దరఖాస్తు రుసుం రూ.1180;  (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకైతే రూ.118)
  • వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25-38 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వేతనం: నెలకు స్కేల్-3 పోస్టులకు రూ.63,840-రూ.78,230. స్కేల్-2 పోస్టులకు రూ.48,170-రూ.69,810
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని