IDBI Results: ఐడీబీఐలో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పరీక్ష ఫలితాలు విడుదల

ఐడీబీఐలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను సమర్పించడం ద్వారా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు.

Updated : 13 Jul 2023 15:53 IST

దిల్లీ: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష జులై 2న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ముఖ్య కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 1036 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.29,000 నుంచి రూ.34,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కుల వివరాలివే..

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని