SSC: ఎంటీఎస్‌ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించం... త్వరగా అప్లై చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు SSC కీలక సూచనలు చేసింది.

Updated : 10 Jul 2023 17:20 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 1500కు పైగా మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ (MTS), హవల్దార్‌ (సీబీఐసీ & సీబీఎన్‌) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి అర్హతతో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు జులై 21వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అభ్యర్థులు చివరి  తేదీ వరకు ఎవరూ చూడొద్దని.. ముగింపు రోజుల్లో సర్వర్‌లో అధిక ట్రాఫిక్‌ కారణంగా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావడంలో సమస్యలు ఎదురుకావొచ్చని తెలిపింది. ఇలాంటి సమస్యల్ని నివారించేందుకు ముందుగానే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఎట్టిపరిస్థితుల్లో పొడిగించబోమని తేల్చి చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 1,558 ఉద్యోగాలకు గానూ.. 1,198 పోస్టులు మల్టీటాస్కింగ్‌ సిబ్బంది కాగా.. 360 పోస్టులు సీబీఐసీ, సీబీఎన్‌లో హవల్దార్‌ పోస్టులు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని