CBSE: సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల

CBSE Admit cards: సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Published : 07 Jul 2023 19:58 IST

దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పది, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  ఈ నెల 17 నుంచి పరీక్షలు  ప్రారంభం కానుండటంతో హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  రెగ్యులర్‌ విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డులను సంబంధిత స్కూల్స్‌ వివరాలతో లాగిన్‌ అయి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రైవేటు అభ్యర్థులు  ఈ లింక్‌ https://cbseit.in/cbse/web/comptt/పై క్లిక్‌ చేసి తమ వివరాలను సమర్పించడం ద్వారా అడ్మిట్‌ కార్డులు పొందొచ్చని  సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డా.సన్యం భరద్వాజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. జులై 17 నుంచి 22వరకు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

రెగ్యులర్‌ విద్యార్థుల అడ్మిట్‌ కార్డులు.. క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని