TS EAMCET 2023: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు  ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు.

Updated : 06 Jul 2023 19:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు  ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా  ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, శనివారం ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఈనెల 9న ఇంజినీరింగ్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. వెబ్‌ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12 వరకు పొడిగించారు. ఈనెల 16న తొలివిడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈనెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌.. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని  ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఇదీ చదవండి.. తెలంగాణ ‘పది’ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?

రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్ల (Engineering Seats)కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కోర్‌ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ.27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య 1,00,671 చేరింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని