Postal jobs: పోస్టల్ లో 12 వేల పోస్టులు.. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తొలి జాబితా వచ్చేసింది

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(GDS)ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated : 07 Jul 2023 11:33 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(GDS)ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం  దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను(మణిపుర్ మినహా) తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జూలై 17 లోగా  ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ తొలి జాబితా కోసం క్లిక్ చేయండి 

తెలంగాణ జీడీఎస్ తొలి జాబితా  కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు