CBSE Results: ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం.. వచ్చే ఏడాది CBSE పరీక్షలకు డేట్ ఫిక్స్..!
వచ్చే ఏడాది జరగబోయే సీబీఎస్‌ఈ పరీక్షల తేదీని అధికారులు ప్రకటించారు. అలాగే, ఈ ఏడాది పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాలు, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ తదితర వివరాలు వెల్లడించారు.
దిల్లీ: వచ్చే ఏడాది సీబీఎస్‌ఈ(CBSE Exams) 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు తేదీ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు. ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించిందని తెలిపారు.
‘పది’లో 3.8లక్షల మందికి 90% పైగా మార్కులు
మరోవైపు, ఈ ఏడాది నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కాగా.. 3.8లక్షల మంది పదో తరగతి విద్యార్థులు 90 శాతానికి పైగా స్కోరు సాధించగా.. 66వేల మందికి పైగా 12వ తరగతి విద్యార్థులు 95శాతం పైగా స్కోరు సాధించారని భరద్వాజ్ వెల్లడించారు. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించలేదన్నారు. 12వ తరగతి విద్యార్థుల్లో 1,12,838 మంది 90శాతం పైగా స్కోరు సాధించగా.. 22,622మంది విద్యార్థులు 95శాతం పైగా మార్కులు సాధించారన్నారు. అలాగే, పదో తరగతిలో 1,95,799మంది విద్యార్థులు 90శాతం పైగా స్కోరు సాధించగా.. 44,297మంది 95శాతానికి పైగా స్కోరు సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను 21,65,805 మంది విద్యార్థులు రాయగా.. 20,16,779 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 93.12గా నమోదైంది. గతేడాది(94.40%)తో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.28 తగ్గడం గమనార్హం. అలాగే, 12వ తరగతి పరీక్షలను దేశ వ్యాప్తంగా 16,60,511 మంది విద్యార్థులు రాయగా.. 14,50,174 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 87.33గా నమోదైంది. గతేడాది(92.71%)తో పోలిస్తే 5.38శాతం తగ్గినట్టు అధికారులు వెల్లడించారు.
జులైలో సప్లిమెంటరీ పరీక్షలు
జాతీయ విద్యావిధానం (NEP-2020) చేసిన సిఫారసుల ఆధారంగా కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును ‘సప్లిమెంటరీ’గా మార్చాలని సీబీఎస్‌ఈ నిర్ణయించిందని భరద్వాజ్ వెల్లడించారు. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకొనేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా రాసుకొనేందుకు వెసులుబాటు కల్పించగా.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. సప్లిమెంటరీ కేటగిరీ విద్యార్థులతో పాటు మార్కులను మెరుగుపరుచుకొనేందుకు మళ్లీ కొన్ని సబ్జెక్టులు రాయాలనుకొనేవారికి జులైలో పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
VarunTej-Lavanya: వేడుకగా వరుణ్ తేజ్ - లావణ్య నిశ్చితార్థం.. మెగా, అల్లు హీరోల సందడి
-
Politics News
Bhagwant Mann: ‘మీ కుర్చీ.. నా భర్త ఇచ్చిన గిఫ్ట్’: పంజాబ్ సీఎంకు సిద్ధూ భార్య కౌంటర్
-
General News
KCR: ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్ : కేసీఆర్
-
India News
Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్ రౌత్
-
Sports News
WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్
-
Crime News
Shamshabad: బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు