Agniveervayu: వాయుసేన అగ్నివీర్ అడ్మిట్‌ కార్డులు విడుదల

అగ్నివీర్‌వాయు రాతపరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఇలా పొందొచ్చు.

Published : 09 May 2023 21:54 IST

దిల్లీ: భారత వాయుసేన (Indian Air force)లో అగ్నివీరులుగా (Agniveer) చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్‌. అగ్నిపథ్‌ (Agnipath) పథకంలో భాగంగా అగ్నివీర్‌వాయు (Agniveervayu) పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  మే 20 నుంచి రాత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.  దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్‌ నేమ్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డును పొందొచ్చు. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక పూర్తి చేయనున్నారు.  వాయుసేనలో అగ్నివీర్‌-వాయు ఉద్యోగాలకు మార్చి 17 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని