CUET-UG ఫలితాలు విడుదల.. 22వేల మందికి 100శాతం స్కోర్‌

CUET-UG Exam Results: సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇలా తెలుసుకోండి..!

Published : 15 Jul 2023 16:12 IST

దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు (CUET-UG Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (NTA) శనివారం విడుదల చేసింది. ఈ పరీక్షలో దాదాపు 22వేలకు పైగా అభ్యర్థులు 100శాతం స్కోరు సాధించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. విద్యార్థులు cuet.samarth.ac.in వెబ్‌సైట్‌కి వెళ్లి తమ వివరాలతో లాగిన్‌ అయి ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నాలుగేళ్లకే రెండు పట్టాలు!

అత్యధికంగా ఇంగ్లీష్‌లో 5,685 మంది, ఆ తర్వాత బయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో 4,850 మంది, ఎకానమిక్స్‌ 2,836 మంది 100 శాతం స్కోరు సాధించారు. ఈ ఏడాది మే 21 నుంచి జూన్‌ 23 వరకు ఈ పరీక్ష (CUET-UG Exam) తొమ్మిది దశల్లో నిర్వహించగా.. దేశవ్యాప్తంగా 387 నగరాలు, విదేశాల్లోని 24 నగరాల్లో దాదాపు 11.11లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

44 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 12 స్టేట్‌ యూనివర్సిటీలు 11 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 19 ప్రైవేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం గతేడాది నుంచి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద ప్రవేశ పరీక్ష ఇది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని