JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్లు షురూ.. ఇలా అప్లై చేసుకోండి!

JEE Advanced 2023Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

Updated : 30 Apr 2023 16:29 IST

గువాహటి: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam)కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులు మే 7లోపు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మే 8 సాయంత్రం 5గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది. మే 29 నుంచి జూన్‌ 4వరకు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్ష జూన్‌ 4న జరగనుండగా.. పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్‌ 11న; ఫలితాలు జూన్‌ 18న విడుదల చేస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

  • తొలుత www.jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • apply for JEE advanced 2023 లింక్‌పై క్లిక్‌ చేయండి
  • మీ వివరాలతో రిజిస్టర్‌ అయ్యి.. లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయండి
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 దరఖాస్తు ఫారం పూర్తి చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
  • చివరగా దరఖాస్తును సబ్‌మిట్‌ చేసి ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసి భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోండి

ఫీజు ఇలా.. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1450; ఇతర విద్యార్థులందరికీ రూ.2900ల చొప్పున దరఖాస్తు రుసుం నిర్ణయించారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని