నోటీస్‌బోర్డు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (హైయర్ గ్రేడ్) - 04
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ. 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్, పీహెచ్‌డీ, ఉద్యోగానుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూతో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2025
వెబ్‌సైట్:https://uoc.ac.in/index.php/vacancies-careers
జూనియర్ రెసిడెంట్లు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాయ్‌బరేలీ తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
జూనియర్ రెసిడెంట్ - 16
అర్హత: ఎంబీబీఎస్, డీబీఎస్‌తో పాటు ఇంర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
గరిష్ఠ వయసు: 37 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
మూల వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక: ఇంటర్వ్యూతో
ఇంటర్వ్యూ తేదీ: 10.11.2025, వేదిక: ఎల్‌టీ-గ్రౌండ్, మెడికల్ కాలేజ్, ఎయిమ్స్, రాయ్‌బరేలి, ఉత్తర్‌ప్రదేశ్.
వెబ్‌సైట్:https://aiimsrbl.edu.in/recruitments
మెడికల్ ఆఫీసర్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), జమ్మూ ఒప్పంద ప్రాతిపదికన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000- రూ.70,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2025.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూతో
వెబ్‌సైట్:https://iitjammu.ac.in/postlist/Jobs
ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్లు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ), చండీగఢ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
సీనియర్ రెసిడెంట్(బ్రాడ్ స్పెషాలిటీ): 94
విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, చెస్ట్, డెర్మటాలజీ, మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఐసీయూ, ఎన్‌ఐసీయూ, పీఐసీయూ.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
మూల వేతనం: నెలకు రూ.67,700.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఐసీ ఉద్యోగులకు ఫీజు లేదు.
ఎంపిక: ఇంటర్వ్యూతో 
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 7. 
వెబ్‌సైట్:https://www.esic.gov.in
దక్షిణ మధ్య రైల్వేలో..
దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
స్పోర్ట్స్ కోటా పోస్టులు: 61
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఖోఖో, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ తదితరాలు.
అర్హత: టెన్త్/ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు దేశం/రాష్ట్రం/విశ్వవిద్యాలయం/పాఠశాల తరపున గుర్తింపు పొందిన క్రీడా పోటీలలో విజయం సాధించాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: క్రీడా ప్రదర్శన పరీక్షలు (స్పోర్ట్స్ ట్రయల్స్), ధ్రువపత్రాల పరిశీలనతో.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.11.2025. 
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మైనారిటీ/ఓబీసీలకు రూ.250.
వెబ్‌సైట్:https://scr.indianrailways.gov.in/
ఐఐఐటీ కొట్టాయంలో..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొట్టాయం.. పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్ జనవరి సెషన్ 2026
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. 
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 14-11-2025.
ఇంటర్వ్యూ తేదీలు: నవంబరు 16 నుంచి 20 వరకు
వెబ్‌సైట్: https://www.iiitkottayam.ac.in/#!/home
ఐఐఎస్‌టీలో పీహెచ్‌డీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), తిరువనంతపురం పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్- జనవరి 2026 సెషన్. విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియోనిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్/సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్/ఎన్‌బీహెచ్‌ఎం/జెస్ట్ స్కోరు ఉండాలి.
వయసు: 20.11.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలు, జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష మార్కులు, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూతో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2025.
వెబ్‌సైట్:https://www.iist.ac.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


