Job: బోర్డర్ రోడ్స్ సంస్థలో 542 కొలువులు

భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ).. 542 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
మొత్తం 542 ఉద్యోగాల్లో.. అన్ రిజర్వుడ్‌కు 269, ఓబీసీలకు 136, ఈడబ్ల్యూఎస్‌లకు 27, ఎస్సీలకు 72, ఎస్టీలకు 38 కేటాయించారు.
వెహికల్ మెకానిక్ 324, ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్) 13, ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్) 205 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ట్రేడును బట్టి పరీక్ష వ్యవధి గంట నుంచి మూడు గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్/ సబ్జెక్టివ్ విధానంలో ఇస్తారు. అయితే దరఖాస్తుల సంఖ్యను బట్టి రాత పరీక్షను ఏ విధానంలో నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో, సబ్జెక్టివ్ ప్రశ్నలకు కాగితంపై సమాధానాలు రాయాలి. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 125 ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉండవు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, ఎబిటీల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ట్రేడ్-సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 అడుగుతారు.
ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో పరుగు, లాంగ్ జంప్, పుషప్స్ ఉంటాయి. అర్హత సాధించినవారికి ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. ప్రాథమికంగా ఎంపికైనవారి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. వారు తర్వాతి దశలకు పుణెలోని జీఆర్‌ఈఎఫ్ సెంటర్‌లో హాజరుకావాలి.
సన్నద్ధత
- ట్రేడ్ సెక్షన్‌కు ఎక్కువ మార్కులు కేటాయించారు. సబ్జెక్టుల్లోని అంశాలను చదువుకుని పునశ్చరణ చేసుకోవాలి.
 - రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్‌లకు వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
 - రుణాత్మక మార్కులు లేవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
 - ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. దీంట్లో ప్రతిభ కనబరచక పోతే తదుపరి దశకు ఎంపిక చేయరు. కాబట్టి రన్నింగ్, లాంగ్‌జంప్, పుషప్‌లకు సమయం కేటాయించి, సాధన చేయాలి.
 
ముఖ్యాంశాలు
అర్హతలు: మూడు పోస్టులకు మెట్రిక్యులేషన్ పూర్తిచేయాలి. వెహికల్ మెకానిక్‌కు.. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్/ బ్రిక్స్ మేసన్‌లో ఐటీఐ/ ఐటీసీ/ ఒకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: వెహికల్ మెకానిక్‌లకు 18-27 సంవత్సరాలు, ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్), డీఈఎస్‌లకు 18-25 ఏళ్లు ఉండాలి. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.50. ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.
వేతన శ్రేణి: వెహికల్ మెకానిక్‌కు నెలకు రూ.19,900-63,200. ఎంఎస్‌డబ్ల్యూలకు 18,000-56,900. హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ, ఇతర అలవెన్సులూ ఉంటాయి.
చిరునామా: దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన వాటికి సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేసి.. కమాండెంట్, జీఆర్‌ఈఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె-411 015 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 24.11.2025
వెబ్‌సైట్: https://bro.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 


