టీటీడీలో పారా మెడికల్‌ పోస్టులు

Eenadu icon
By Features Desk Published : 30 Oct 2025 00:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 6 పారా మెడికల్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • పీడియాట్రిక్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌: 01
  • పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌: 01
  • పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అనస్థెటిస్ట్‌: 01
  • పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌: 01
  • పీడియాట్రిషియన్‌: 01
  • డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, డీఆర్‌ఎన్‌బీ, ఎంఎస్‌, పీజీతో పాటు పని అనుభవం.

వేతనం: నెలకు డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌కు రూ.60,000, మిగిలిన పోస్టులకు రూ.1,50,000 నుంచి రూ.3,00,000 వరకు.

ఎంపిక: ఇంటర్వ్యూతో.

ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 1.

వెబ్‌సైట్‌: https://tirumala.org/


ఐఆర్‌సీటీసీలో మానిటర్స్‌

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌సీటీసీ) సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఒప్పంద ప్రాతిపదికన 46 హాస్పిటాలిటీ మానిటర్స్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

హాస్పిటాలిటీ మానిటర్స్‌: 46

అర్హత: బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)తోపాటు పని అనుభవం.

వయసు: జనవరి 1, 2025 నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి వడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.30,000.

ఎంపిక: ఇంటర్వ్యూతో.

ఇంటర్వ్యూ తేదీలు: నవంబరు 13, 14.

వేదిక: ఐఆర్‌సీటీసీ, సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ ఆఫీస్‌, 1వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్‌ ప్లాజా, సరోజినీదేవి రోడ్‌, సికింద్రాబాద్‌-500003.

వెబ్‌సైట్‌: https://irctc.com/


టీఐఎఫ్‌ఆర్‌లో జేఆర్‌ఎఫ్‌

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్‌తో పాటు పని అనుభవం, నెట్‌/గేట్‌ స్కోరు ఉండాలి.

వయసు: జులై 1, 2025 నాటికి 28 ఏళ్లు ఉండాలి.

ఫెలోషిప్‌: నెలకు రూ.37,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 17.

వెబ్‌సైట్‌: https://www.tifr.res.in/maincampus/careers.php


ఐఐఐటీ బెంగళూరులో రిసెర్చ్‌ అసోసియేట్లు

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన 5 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ - 01
  • రిసెర్చ్‌ అసోసియేట్‌ - 01
  • సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ - 01
  • రిసెర్చ్‌ ఇంటర్న్‌ - 01
  • అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ (ప్రాజెక్ట్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌) - 01

అర్హత: పోస్టును అనుసరించి బీటెక్‌/ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)తో పాటు ఉద్యోగానుభవం.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: srinivas.vivek@iiitb.ac.in.

దరఖాస్తుకు చివరి తేదీ: 01-11-2025.

ఎంపిక: ఇంటర్వ్యూతో.

వెబ్‌సైట్‌: https://www.iiitb.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని