Central Warehousing Corporation: సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో అవకాశాలు

సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ).. 22 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల్లో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్-16, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (రాజ్‌భాష)-6 ఉన్నాయి. ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలనతో ఎంపిక చేస్తారు.
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ, ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో ఏడాది కోర్సు పూర్తిచేయాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయాలి. హిందీ టైపింగ్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
180 మార్కులకు ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తారు. వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిషుల్లో ఆరు సెక్షన్లతో ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు వేర్వేరు సమయాలు ఉంటాయి. 20 రీజనింగ్ ప్రశ్నలకు 20 మార్కులు, వ్యవధి 20 నిమిషాలు. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలకు, 20 మార్కులు సమయం 15 నిమిషాలు. డేటా అనాలిసిస్, ఇంటర్ ప్రెటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, వ్యవధి 40 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, వ్యవధి 20 నిమిషాలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, సమయం 25 నిమిషాలు. లాంగ్వేజ్ అండ్ కాంప్ర హెన్షన్ ఎబిలిటీస్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో రెండు ప్రశ్నలకు 30 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో లెటర్ రైటింగ్‌కు 10 మార్కులు, ఎస్సేకు 30 మార్కులు.
రాత పరీక్షలో 40 శాతం కనీసార్హత మార్కులు సాధించినవారిని జేపీఏ పోస్టుకు 1:10 నిష్పత్తిలో, జేఈ (రాజ్‌భాష)కు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన/ స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఈ టెస్టులను దిల్లీలో నిర్వహిస్తారు. వీటి తేదీ, వివరాలను కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు. రాత పరీక్షల సాధించిన మార్కులతో, కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (రాజ్‌భాష): ఇంగ్లిష్ మెయిన్ సబ్జెక్టుగా హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చదివుండాలి. లేదా బీఏ హిందీకి సమానమైన డిగ్రీ/ డిప్లొమా కోర్సు పూర్తిచేయాలి. హిందీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు.
ప్రశ్నపత్రం 200 మార్కులకు హిందీ, ఇంగ్లిషుల్లో ఉంటుంది. వ్యవధి మూడు గంటలు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరు సమయాలు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు వ్యవధి 25 నిమిషాలు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు, వ్యవధి 25 నిమిషాలు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, వ్యవధి 15 నిమిషాలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, 15 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ (ఆబ్జెక్టివ్) 50 ప్రశ్నలు, 50 మార్కులు, వ్యవధి 50 నిమిషాలు. దీంట్లో హిందీ, ఇంగ్లిష్ గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ (డిస్క్రిప్టివ్) రెండు ప్రశ్నలకు 50 మార్కులు, వ్యవధి 50 నిమిషాలు. వ్యాసాన్ని హిందీ నుంచి ఇంగ్లిష్‌కు, ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువదించాలి. డిస్క్రిప్టివ్ టెస్టును కూడా ఆన్‌లైన్‌లోనే రాయాలి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
ముఖ్యాంశాలు
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
 - జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ అభ్యరులకు దరఖాస్తు ఫీజు రూ.1350. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు రూ.500.
 - వేతనం నెలకు రూ.29,000 నుంచి 93,000 వరకూ ఉంటుంది. మూలవేతనానికి అదనంగా ఇతర అలవెన్సులూ ఉంటాయి.
 
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15
వెబ్‌సైట్: http://www.cewacor.nic.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

యువతిపై గ్యాంగ్ రేప్: ఎయిర్ పోర్ట్ వద్ద నిందితులపై ఎన్కౌంటర్
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 


