వయసు సడలింపు వర్తిస్తుందా?

పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీకి గరిష్ఠ వయసు 42 ఏళ్లని ప్ర£కటించారు. నాకు 48 ఏళ్లు. నాది బీసీ సామాజిక వర్గం. ప్రభుత్వ ఉద్యోగులకుండే ఐదేళ్ల సడలింపు నాకు వర్తిస్తుందా?
ఎస్.జగదీశ్, విజయనగరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయః పరిమితి 42 సంవత్సరాలుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారికి ఐదు సంవత్సరాల 
సడలింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఐదేళ్ల సడలింపు ఉంది. కానీ, ఈ సడలింపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, కార్పొరేషన్లలో పనిచేస్తున్నవారికీ, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులకూ వర్తించదు. శాశ్వత ఉద్యోగికి కూడా రెగ్యులర్ సర్వీసు కాలాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల సడలింపు ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. మీరు పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఈ ఐదేళ్ల అదనపు సడలింపు మీకు వర్తించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం బీసీ వర్గానికి సంబంధించిన ఐదేళ్ల సడలింపుతో పాటు, మీ రెగ్యులర్ ఉద్యోగ సర్వీసు కాలాన్ని బట్టి మరికొన్ని సంవత్సరాల సడలింపు మీకు వర్తించే అవకాశం ఉంది. కానీ, వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న నిబంధనలకు లోబడి మాత్రమే ఈ సడలింపులు ఉంటాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
 - 
                        
                            

రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
 - 
                        
                            

టికెట్లకు డబ్బుల్లేవు.. మహిళా క్రికెట్ జట్టుకు మొత్తం పారితోషికం ఇచ్చేసిన మందిరా బేడీ
 - 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 


