డాగ్‌ ట్రెయినర్‌ కావాలంటే..

Eenadu icon
By Features Desk Published : 04 Nov 2025 03:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బీఎస్సీ చదివాను. జంతువులంటే చాలా ఇష్టం. నగరంలో డాగ్‌ ట్రెయినర్‌గా పని చేయాలనుంది. దీని కోసం కోర్సులు ఎక్కడ ఉంటాయి?

రిషి

డాగ్‌ ట్రెయినర్‌గా పనిచేయాలనుంటే.. కుక్కలపై విపరీతమైన ప్రేమ, ఓపిక, సహానుభూతి ఉండాలి. వాటి విభిన్న అవసరాల గురించి తెలుసుకోవాలి. వాటి మనస్తత్వంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. డాగ్‌ ట్రెయినింగ్‌ గురించి వివిధ ఆన్‌లైన్‌ కోర్సులు.. కోర్స్‌ ఎరా, యుడేమి లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. డాగ్‌ ట్రెయినింగ్‌లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులు కూడా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో డాగ్‌ బ్రీడింగ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌ బెంగళూరులో ఉంది. హైదరాబాద్‌లో పలు ప్రైవేటు సంస్థలు డాగ్‌ ట్రెయినింగ్‌లో శిక్షణ అందిస్తున్నాయి. కాకపోతే, ఇక్కడ ఫీజులు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. 

ఫీజు, కోర్సు వ్యవధి ప్రాక్టికల్స్‌ గురించి పూర్తి వివరాలు సేకరించండి.

శిక్షణ పూర్తయిన తర్వాత ప్రొఫెషనల్‌ ట్రెయినర్‌గా పనిచేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అనే విషయాన్ని ఆ సంస్థ నుంచీ, గతంలో శిక్షణ పొందినవారి నుంచీ తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ట్రెయినింగ్‌ కోర్సులో చేరేముందు ఆ సంస్థ లైసెన్స్, అక్రెడిటేషన్, పూర్వ విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ ఇవన్నీ తెలుసుకోండి. ట్రెయినింగ్‌లో బోధించే సిలబస్‌ వివరాలు ముందే ఆరా తీయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని