Speech Therapist: స్పీచ్ థెరపిస్ట్ అవ్వాలంటే?

బీఎస్సీ చదువుతున్నాను. స్పీచ్ థెరపిస్ట్ కావాలంటే ఏ కోర్సు చేయాలి? ఆటిజం లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి?
నివేదిత
ఆటిజం లాంటి అవసరాలున్న పిల్లల కోసం ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా అర్హత ఉన్న పిల్లలందరికీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక అవసరాలున్న బాలలకు బోధించడానికి బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) శిక్షణ పొందినవారికి ఎక్కువ నైపుణ్యాలుంటాయి. ఇలా శిక్షణ పొందినవారు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొంది వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఆటిజం లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
ఇలాంటి పిల్లల కోసం 14 సంవత్సరాల వయసు వరకు సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవిత కేంద్రాల్లో స్పెషల్ ట్రెయినింగ్, వారానికోసారి స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 125 ఆటిజం సెంటర్లను ప్రారంభించబోతోంది.
స్పీచ్ థెరపిస్ట్ అవ్వాలంటే హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు పొందిన.. నాలుగేళ్ల వ్యవధి బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ) చదవాలి. స్పీచ్ థెరపీలో నాలుగేళ్ల డిగ్రీ చేయాలంటే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు బయాలజీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీల్లో ఏదో ఒక సబ్జెక్ట్ చదివుండాలి. మీరు ఇంటర్మీడియట్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండకపోతే స్పీచ్ థెరపిస్ట్ అవ్వడం కష్టం. స్పీచ్ థెరపీ రంగంలోకి డిగ్రీ లేకుండా ప్రవేశించాలనుకుంటే.. ఆడియోమెట్రీ/ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్‌లో డిప్లొమా చేసి టెక్నీషియన్‌గా కెరియర్ ప్రారంభించవచ్చు. కానీ డిప్లొమా చేయడానికి కూడా ఇంటర్మీడియట్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
స్పీచ్ థెరపీలో డిగ్రీ/ పీజీ చేసినవారికి ఈఎన్‌టీ క్లినిక్స్, దివ్యాంగుల పునరావాస కేంద్రాలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లల పాఠశాలలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, దివ్యాంగులకోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆసక్తి ఉంటే సొంతంగా క్లినిక్ పెట్టుకోవచ్చు. తెలంగాణలో బీఏఎస్‌ఎల్‌పీ ప్రోగ్రాంలు స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేెషన్ సైన్సెస్, హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్, ఆలీ యవర్ జంగ్ నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్, మా ఇన్‌స్టిట్యూట్, ఆశ్రయ్ ఆకృతిల్లో అందుబాటులో ఉంది. ఏదైనా స్పీచ్ థెరపీ విద్యా సంస్థను ఎంచుకొనేముందు ఆ సంస్థ అందించే ప్రోగ్రాంకు ఆర్‌సీఐ గుర్తింపు ఉందో లేదో నిర్థరించుకోండి.
మన సమాజంలో మాట్లాడే, వినికిడి, భాషాభివృద్ధి లోపాలున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వీరికి ప్రత్యేక శ్రద్ధ, శిక్షణ ఇవ్వడంలో స్పీచ్ థెరపిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. వీరు మాట్లాడే విధానం, వినికిడి సామర్థ్యం, భాషా వినియోగం లాంటి అంశాల్లో సహాయం చేస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసి, వారిని సమాజంలో పూర్తిగా భాగం చేసే ప్రక్రియలో సహకరిస్తారు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

‘రాజా సాబ్’ ప్రీరిలీజ్ ఎక్కడంటే.. వాయిదాపై నిర్మాణసంస్థ పోస్ట్!
 - 
                        
                            

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
 - 
                        
                            

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
 - 
                        
                            

ట్రంప్ టారిఫ్‌లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 - 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 


