ICAI CA Results: సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలు విడుదల.. టాపర్లు వీళ్లే..

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి

Published : 05 Jul 2023 17:18 IST

దిల్లీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.  మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ICAI బుధవారం విడుదల చేసింది. విద్యార్థులు https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను పొందొచ్చు. సీఏ ఫైనల్‌ పరీక్షలో అహ్మదాబాద్‌కు చెందిన అక్షయ్‌ రమేశ్‌ జైన్‌ 616/800 మార్కులు సాధించగా.. కల్పేశ్‌ జైన్‌ జి 603/800; ప్రఖార్‌ వర్షిణి 574/800 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇకపోతే సీఏ ఇంటర్‌లో  వై. గోకుల్‌ సాయి శ్రీకర్‌; నూర్‌ సింగ్లా, కావ్య సందీప్‌ కొఠారీలు టాపర్లుగా నిలిచి సత్తా చాటారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇంటర్మీడియట్‌ కోర్సులో గ్రూపు-1 పరీక్షలు మే 3, 6, 8, 10 తేదీల్లో;  గ్రూపు-2ను 12, 14, 16, 18 తేదీల్లో ICAI నిర్వహించింది. అలాగే, ఫైనల్‌ విద్యార్థులకు గ్రూపు-1ను మే 2, 4, 7, 9 తేదీల్లో, గ్రూపు-2ను మే 11, 13, 15, 17 తేదీల్లో పరీక్ష నిర్వహించిన ఐసీఏఐ తాజాగా ఫలితాలను ప్రకటించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని